Dec 13,2022 22:20

- పార్లమెంటులో ప్రకటించిన కేంద్రం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
దేశంలోని బడా కార్పొరేట్లకు గత ఐదేళ్లలో అక్షరాలా రూ.పది లక్షల కోట్లకు పైబడి ప్రజల ధనాన్ని దోచిపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నిస్సిగ్గుగా ప్రకటించింది. రాజ్యసభలో సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయం చెప్పారు. భారత రిజర్వుబ్యాంకు (ఆర్‌బిఐ) గణాంకాల ప్రకారం ఐదేళ్లలో బ్యాంకులు రూ.10,09,510 కోట్లు రుణమాఫీ (రైటాఫ్‌) చేశాయని తెలిపారు.
సంవత్సరం రుణమాఫీ (కోట్లలో)
2017-18      రూ. 1,61,328
2018-19     రూ. 2,36,265
2019-20     రూ. 2,34,170
2020-21     రూ. 2,02,781
2021-22     రూ. 1,74,966
మొత్తం      రూ.10,09,510

పోర్టులకు 11,779 ఎకరాలు
దేశంలోని ప్రయివేటు కంపెనీలకు ఆరేళ్లలో 11,779.42 ఎకరాలు ఇచ్చినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో పోర్టుల కోసం ప్రయివేటు కంపెనీలకు 11,779.42 ఎకరాలు లీజుకిచ్చామని పేర్కొన్నారు.

ఏడాది     ఇచ్చిన ఎకరాలు
2016        299.63
2017        6803.84
2018        269.36
2019       3967.68
2020      115.91
2021       322
మొత్తం  11,779.42