Sep 28,2023 22:31

వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్‌
ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ భారతజట్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కింది. బిసిసిఐ తాజాగా వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఆడే 15మంది ఆటగాళ్ల జాబితాను గురువారం వెల్లడించింది. తొలి దఫా ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అక్షర్‌ పటేల్‌ తీవ్రంగా గాయపడడంతో అతని స్థానంలో అశ్విన్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించకుఉన్నాడు. ఇక ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ గాయపడ్డ అక్షర్‌ పటేల్‌ స్థానంలో అశ్విన్‌ తుదిజట్టులో వచ్చి చేరాడు. బంగ్లా మ్యాచ్‌ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డ అక్షర్‌ పటేల్‌ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం నాటికి అందుబాటులో రావడం సాధ్యమయ్యే పని కాదని తేల్చిన బిసిసిఐ అశ్విన్‌కు చోటు కల్పించింది. దీంతో భారతజట్టు ముగ్గురు స్పిన్నర్లతో వన్డే ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. జడేజా, కుల్దీప్‌, అశ్విన్‌లతో కూడిన స్పిన్‌ త్రయంతో భారతజట్టు దుర్భేద్య ఫామ్‌లో ఉంది. ఇక అక్టోబర్‌ 8న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారతజట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2011, 2015 వన్డే ప్రపంచకప్‌లలో అశ్విన్‌ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
వార్మప్‌ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బావుమా దూరం
వన్డే ప్రపంచకప్‌ కోసం రెండ్రోజుల కిందట దక్షిణాఫ్రికా జట్టు తిరువనంతపురానికి చేరుకుంది. అక్కడ సెప్టెంబరు 29న అఫ్గానిస్థాన్‌తో, అక్టోబర్‌ 2న న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, రెండు మ్యాచ్‌లకు సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బావుమా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడి తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో వార్మప్‌ మ్యాచ్‌లకు మార్‌క్రమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. దిల్లీ వేదికగా అక్టోబర్‌ 7న జరిగే ఈ మ్యాచ్‌కు బావుమా అందుబాటులో ఉండే అవకాశముంది.
జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), హార్దిక్‌, శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, కెఎల్‌ రాహుల్‌, ఇషాన్‌(వికెట్‌ కీపర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌. జడేజా, శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, షమీ, అశ్విన్‌,