Oct 17,2023 22:10

ధర్మశాల: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ ఎడ్వర్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ జట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడులకు టాపార్డర్‌ కూలినా.. లోయరార్డర్‌ పోరాటపటిమతో నెదర్లాండ్స్‌ మంచి గౌరవప్రద స్కోరు సాధించింది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌(78నాటౌట్‌; 69బంతుల్లో 10ఫోర్లు, సిక్సర్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత సంతతికి చెందిన మరో ఆటగాడు ఆర్యన్‌ దత్‌ చివర్లో దూకుడుగా ఆడాడు. ఆర్యన్‌ దత్‌ 9 బంతుల్లో 3 సిక్సర్లు బాది 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. గతంలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం నెదర్లాండ్స్‌ తరఫున ఆడుతున్న వాన్‌ డెర్‌ మెర్వ్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సహా 29 పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 2, మార్కో యాన్సెన్‌ 2, కగిసో రబాడా 2, గెరాల్డ్‌ కోట్జీ 1, కేశవ్‌ మహరాజ్‌ 1 వికెట్‌ తీశారు.
స్కోర్‌బోర్డు...
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: విక్రమ్‌జిత్‌ (సి)క్లాసెన్‌ (బి)రబడా 2, మ్యాక్స్‌ ఒడోడ్‌ (సి)డికాక్‌ (బి)జెన్సన్‌ 18, అకెర్మన్‌ (బి)కొట్‌జీ 13, లీడె (ఎల్‌బి)రబడా 2, ఎంగెబ్రెత్‌ (సి)జెన్సన్‌ (బి)ఎన్గిడి 19, తేజ నిడమానూరు (ఎల్‌బి)జెన్సన్‌ 20, ఎడ్వర్డ్స్‌ (నాటౌట్‌) 78, బెక్‌ (స్టంప్‌)డికాక్‌ (బి)మహరాజ్‌ 10, మెర్వ్‌ (సి)డికాక్‌ (బి)ఎన్గిడి 29, ఆర్యన్‌ డట్‌ (నాటౌట్‌) 23, అదనం 31. (43ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 245పరుగులు.
వికెట్ల పతనం: 1/22, 2/24, 3/40, 4/50, 5/82, 6/112, 7/140, 8/204
బౌలింగ్‌: ఎన్గిడి 9-1-57-2, జెన్సన్‌ 8-1-27-2, రబడా 9-1-56-2, క్రొట్‌జీ 8-0-57-1, మహరాజ్‌ 9-0-38-1.