Jul 12,2023 21:22

హైదరాబాద్‌ : బైక్‌బజార్‌ ఫైనాన్స్‌ ద్వారా పిక్యూ డెలివరీ భాగస్వాములకు 2,000 విద్యుత్‌ వాహనాలను డెలివరీ చేయనున్నట్లు బిగాస్‌ ప్రకటించింది. ఆయా సంస్థలతో భాగస్వామ్యంతో చివరి మైలు డెలివరీ కార్యకలాపాలను ఉన్నతంగా మార్చడంతో పాటుగా రవాణ పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యమని బిజి ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ వ్యవస్థాపకుడు, ఎండి హేమంత్‌ కబ్రా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో పలువురి వినియోగదారులకు బిగాస్‌ ఇవిలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ వాహనాలకు ఫైనాన్స్‌ను అందించడాన్ని బైక్‌బజార్‌ సులభతరం చేయనుందన్నారు. తాము అమ్మకాల తర్వాత కూడా ఉత్తమ సర్వీసింగ్‌ సేవలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.