Aug 17,2023 22:25

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-4
పారిస్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-4లో భారత పురుషుల, మహిళల రికర్వు జట్లకు కాంస్య పతకాలు దక్కాయి. గురువారం జరిగిన పురుషుల కాంస్య పతక ప్లాేఆఫ్‌ పోటీలో ధీరజ్‌ బమ్మిదేవర, అతాను దాస్‌, తుషార్‌ షెల్కేలతో కూడిన రికర్వు జట్టు 6-2(54-56, 57-55, 56-54, 57-55)తో స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్‌, యున్‌ సాంఛెజ్‌, పబ్లో అచ్చాలను ఓడించారు. ఈ టోర్నీలో 2వ సీడ్‌గా బరిలోకి దిగిన పురుషుల రికర్వు జట్టు సెమీస్‌లో చైనీస్‌ తైపీ చేతిలో ఓడి ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. సెమీస్‌లో 0-6(54-56, 47-58, 55-56)తో పురుషుల జట్టు, 0-6(52-57, 47-56, 52-53)తో మహిళల జట్టు చైనీస్‌ తైపీ చేతిలోనే పరాజయాన్ని చవిచూశాయి. ఇక కాంస్య పతక పోటీలో అంకిత భగత్‌, భజన్‌ కౌర్‌, సిమ్రన్‌జీత్‌ కౌర్‌లతో కూడిన మహిళల జట్టు 5-4 (52-55, 52-53, 55-52, 54-52) (27-25)తో షూట్‌ాఆఫ్‌లో మెక్సికోను చిత్తుచేసి పతకాన్ని ఖాయం చేసుకుంది.