చెన్నయ్ : అడ్వాన్స్ పెడియాట్రిక్ కేర్‌లో విజ్ఞానాన్ని పంచుకోవడానికి అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌తో జట్టు కట్టినట్లు అపోలో హాస్పిటల్స్ వెల్లడించింది. ఇందుకోసం పెడిసింక్ 2023 కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పెడియట్రీషన్లకు సబ్ స్పెషాలిటీస్‌పై మరింత అవగాహన పెంచినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సనీతా రెడ్డి పేర్కొన్నారు.