
ఇంటర్నెట్‌డెస్క్ : చలికాలంలో రూమ్ వేడిగా ఉంటేనే నిద్రపడుతుంది. ఇక చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చాలామంది చలి నుంచి రక్షణ కోసం రూమ్ హీటర్లను వాడుతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ హీటర్లను వాడుతున్నా.. వీటివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ రూమ్ హీటర్ నుంచి వచ్చే సౌండ్‌కి నిద్రపట్టదు. అటు కరెంట్‌బిల్లుతోపాటు, ఇటు విసుగు తెప్పించే శబ్దం వంటి సమస్యలతో రూమ్ హీటర్లంటేనే భయపడే పరిస్థితి. అయితే ఇలాంటి సమ్యలేవీ లేకుండా అధునాతనంగా పోర్టబుల్ రూమ్ హీటర్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఈ హీటర్‌ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. సులువుగానూ అమర్చుకోవచ్చు. ఇక సాధారణ రూమ్ హీటర్లకంటే..విద్యుత్ వినియోగం దాదాపు సగానికి సగం తక్కువ. రష్యన్ బహుళజాతి సంస్థ 'బల్లు గ్రూప్' తయారుచేసిన ఈ హీటర్ 'అపోలో బల్లు కన్వెక్షన్ హీటర్' పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. 1500 వాట్ల రూమ్ హీటర్.. మూడు వందల చదరపు అడుగుల గదిని వెచ్చగా ఉంచగలుగుతుంది. ఈ పరికరంలో ఎంతసేపు గది వెచ్చగా ఉంచుకోవాలో ఇందులో ఉండే టైమర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. దీని ధర 179.99 డాలర్లు (సుమారు రూ.15వేలు).