Aug 25,2023 22:12

యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ డ్రా విడుదల
న్యూయార్క్‌: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ డ్రా విడుదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌కు టాప్‌సీడింగ్‌ దక్కింది. అల్కరాజ్‌ తొలిరౌండ్‌లో జర్మనీకి చెందిన కూపర్‌తో టైటిల్‌ వేటను మొదలు పెట్టనున్నాడు. ఇక 2వ సీడ్‌ జకోవిచ్‌కు మరో గ్రూప్‌లో చోటు దక్కింది. ఫైనల్‌కు చేరే క్రమంలో అల్కరాజ్‌ క్వార్టర్‌ఫైనల్లో సిన్నర్‌ను, జకోవిచ్‌ గ్రీక్‌కు చెందిన సిట్సిపాస్‌తో తలపడనున్నారు. గత ఏడాది జెన్నిక్‌ సిన్నర్‌తో సుమారు ఐదుగంటల 15నిమిషాలసేపు తలపడి టోర్నమెంట్‌ లాంగెస్ట్‌ మ్యాచ్‌గా రికార్డు నెలకొల్పింది. ఇక 2వ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌, ఈ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను మూడుసార్లు చేజిక్కించుకున్నాడు. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న జకోవిచ్‌.. మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్కరెట్‌ కోర్టు(24) సరసన చేరనున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో తలపడే సిట్సిపాస్‌ 7వ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. రష్యాకు చెందిన మెద్వదేవ్‌కు 3వ, రుబ్లేవ్‌కు 8వ, సీడింగ్‌ లభించాయి. గత ఏడాది రన్నరప్‌ నార్వేకు చెందిన కాస్పర్‌ రూఢ్‌కు 5వ సీడింగ్‌, హోల్జర్‌ రూనేకు 4వ ర్యాంక్‌తో యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ బరిలోకి దిగనున్నారు. ఈనెల 28నుంచి యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభం కానుంది.