Aug 04,2023 21:10

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 56.04 శాతం వృద్థితో రూ.3,683.87 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,360.70 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.28,412 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ క్రితం త్రైమాసికంలో 17.57 శాతం పెరిగి రూ.33,406.44 కోట్లకు చేరింది.