Apr 28,2023 15:11

ప్రజాశక్తి-ఏలేశ్వరం: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ సంక్షేమ పదాలు అన్ని వర్గాలకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏలేశ్వరంలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అరకొరా సంక్షేమ పథకాలు అందాలన్న దళారులను ఆశ్రయించవలసి వచ్చేది అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నేరుగా సంక్షేమ ఫలాలు అందించి ప్రజలు మన్ననలు పొందిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీరుకొండ రామకుమారి, వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, వైకాపా నేతలు అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవింద్,  నీరుకొండ సత్యనారాయణ, అడపా పార్థసారథి, బీసెట్టి అప్పలరాజు, బుద్ధ ఈశ్వరరావు తదితరులున్నారు.