ప్రజాశక్తి-రెడ్డిగూడెం : అంగన్వాడీ ల్లో "వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ" ద్వారా గర్భిణులకు, చిన్నారులకు, బాలింతలకు, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం వలన ఎంతో మేలు జరుగుతుందని వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్ అన్నారు. రెడ్డిగూడెం మండల శివారు రాఘవపురం ఎస్సీ ఏరియాలో ఉన్న వైయస్సార్ హెల్త్ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు చిన్న పిల్లలకు బలవర్ధకమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మల్లాది రాణి, ఎంఎల్ హెచ్ పి గుంటక వెంకట రమణ, ఎఎన్ఎం విమలారాణి, అంగన్వాడీ కార్యకర్త అరుణ, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.










