ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రంలో దళితవాడను కలుపూ కోతుల వాగుపై నిర్మించిన రెండు వంతెనలు కూడా శిధిలావస్థతో ప్రమాద కరంగా మారిపోయాయి. పడమటి గూడెం వద్ద నిర్మించిన వంతెన ఇప్పుటికే శిధిలమై రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సిఎస్ఐ క్రైస్ట్ సమీపంలో కోతుల వాగుపై నిర్మించిన మరొక వంతెన రెయిలింగ్ పాడైపోయి ప్రమాధకరంగ తయారైంది. ఈ వంతెనపై నిరంతరం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ వంతెన రెయిలింగ్ లేకపోవడంతో అగాధం లాంటి లోతైన లోయ ఉండటంతో ఏదైనా జరగరానిది జరిగితే ఏంటని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ వంతెన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.