ప్రజాశక్తి - ముద్దనూరు : వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టు ల్యాబ్ శనివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యవసాయ సలహాదారులు తిరుపాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి మునిరాజా రెడ్డి, ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు కమిటీ చైర్ పర్సన్ ఉమాదేవి,వైసిపి నాయకులు గుర్రప్ప, వైస్ ఎంపిపి పుష్పలత, ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి, ఎఒ వెంకట కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, మండల సచివాలయం కన్వీనర్ సుమంత్ యాదవ్, ఎంపిటిసి జెడి ఇంద్రాణి, నాయకులు వీర ప్రతాప్, రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.










