ప్రజాశక్తి - వేంపల్లె : ఎరువులు దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలు చేస్తే అలాంటి ఫర్టిలైజేషన్ షాపు యజమానులపై చర్యలు తప్పవని భూసంరక్షణ విభాగపు సహయ వ్యవసాయ సంచాలకులు అనిత అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదేశాలు మేరకు బుధవారం వేంపల్లె మండల పరిధిలో ఉన్న ఫెర్టిలైజర్స్ షాపులను భూ సంరక్షణ సహయ సంచాలకులు అనిత, మండల వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్ లు తనీఖీలు చేపట్టారు. అలాగే రికార్డులను పరిశీలించి, పురుగు మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ బయో ఫెస్టిసైడ్స్ మందులతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, రైతులకు విక్రయించరాదన్నారు. ప్రభుత్వ అనుమతి లేని పురుగుల మందులను, ఎరువులు, విత్తనాలను పర్టిలైజర్స్ యజమానులు విక్రయించరాదు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్మితే అలాగే వ్యక్తులపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విక్రయించే ఎరువులు, పురుగు మందులకు సంబంధించి రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రైతులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని కోరారు. ఎంఆర్ పి ధరలకే పురుగు మందులు విక్రయాలు చేయాలని చెప్పారు. అధిక ధరలకు అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. స్టాక్ రిజిస్టర్ కూడ ఉండాలని లేకపోతే చట్టంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్టిలైజర్ దుకాణాలు తనిఖీ కార్యక్రమంలో చక్రాయపేట మండల వ్యవసాయ అధికారి నవంత్ బాబు, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఎఇఓలు, విఏఏలు పాల్గొన్నారు.