Oct 21,2023 16:15
  • జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి 

ప్రజాశక్తి - వేంపల్లె : చదువుతో పాటు క్రీడాలకు కూడ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని కాబట్టి ప్రతి విద్యార్థి ఆయా క్రీడాల్లో రాణించి గుర్తింపు పొందాలని జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆట స్థలంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి విలు విద్య పోటిలను జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపల్లెలో రాష్ట్ర స్థాయి విలు విద్య పోటిలను నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి క్రీడాలు జరిగే సమయంలో పాఠశాలలో చదివే విద్యార్థులను కూడ ఆహ్వానించాలని కోరారు. విలు విద్య అనేది చాల కష్టంగా ఉంటుందని అయితే లక్ష్యం దిశగా విద్యార్థులు దృష్టి పెట్టితే కష్టం అనేది కనపడదు అన్నారు. విలు విద్యలో వేంపల్లె విద్యార్థులు కూడ రాణించి గ్రామానికీ మంచి పేరు తేవాలని కోరారు. అత్యంత ప్రజా అదరణ పొందిన క్రీడా విలు విద్య క్రీడా అన్నారు. విలు విద్య క్రీడా అనేది స్థిరమైన వృత్తకార లక్ష్యాల వద్ద షూట్ చేస్తారని చెప్పారు. విలు విద్య అనేది ప్రాచీన క్రీడా అన్నారు. భూటన్ లో విలు విద్య అనేది ఒక ప్రసిద్ధ జాతీయ క్రీడా అన్నారు. విలు విద్య అనేది గొప్ప శారీరక వ్యాయామం అన్నారు. విలు విద్యకు ఏకాగ్రత, బలం, సంకల్పం అవసరం అన్నారు.  వినోదభరితమైన ఆర్చర్‌లకు కూడా విలు విద్యతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెప్పారు. షూటింగ్‌కు ఏకాగ్రత అనేది అవసరం అన్నారు. క్రీడాల్లో విద్యార్థులు రాణించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మిగాయిత్రీ, వైకాపా మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, తహశీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపిటిసి భారతి, వార్డు మెంబర్ ముత్యాల ఆంజనేయులు, మణి గోపాల్ రెడ్డి, చెరుకూరి సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్, అర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పాఠశాల ఛైర్మన్ గురుప్రసాద్, కుమ్మరాంపల్లె సర్పంచ్ మునేష్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.