ప్రజాశక్తి - బ్రహ్మంగారి మఠం : బ్రహ్మంగారి మఠం మండలంలోని ఆర్. గొల్లపల్లి గ్రామానికి చెందిన పాల కొండయ్య వయస్సు 19 సంవత్సరాలు శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అవసర నిమితమై బైక్ పై జీవి సత్రం వెళుతుండగా మైదుకూరు నుంచి బ్యాటరీ లోడ్ తో మైదుకూరు వెళుతున్న బోలోరా వాహనం జెడ్. కొత్తపల్లి గ్రామ సమీపానికి రాగానే అదుపు తప్పి ద్విచక్ర వాహనం పై వెళుతున్న పాల కొండయ్యను డీ కొనడంతో పాల కొండయ్య అక్కడికి అక్కడే మృతి చెందాడు.ప్రక్కనే ఆగి ఉన్న మరో ద్విచక్ర వాహనం, ఆటో ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.










