Oct 22,2023 17:24

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : మండలంలోని జ్యోతి కాలనీ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యామల సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. మాక్స్‌ టెంపో వాహనం ప్రిపేర్‌ ఉన్న కారణంగా జ్యోతి కాలనీ వద్దకు వెళ్లేందుకు బైకుపై వెళ్తున్న సుబ్రహ్మణ్యంను ఉల్లిపాయల లోడుతో కడప నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ ఢ కొట్టింది. దీంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మతి చెందాడు. మృతుడు సీవరం వడ్డీ పల్లె గ్రామానికి చెందినవాడు, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.