
- అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన బొలెరో..
ప్రజాశక్తి-పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాయికోట గ్రామం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులతో పాటు అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.