Jun 17,2023 14:40

ప్రజాశక్తి - గంపలగూడెం : అతి చిన్న గ్రామంలో 9 కోట్ల రూపాయలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధి తెలిపారు. శనివారం ఊటుకూరు గ్రామ ఎంపీటీసీ పరిధి గ్రామీణ గాదెవరిగూడెం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ప్రతిఘటన సందర్శించి ప్రజలకు అందిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ముగింపు సమయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో కుల మత పార్టీ వర్గం వ్యత్యాసం లేకుండా పథకాలు అందజేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకై నిరంతరం శ్రమిస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో పేదలకు మంచి జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వార్వలేకపోతున్నారని తెలిపారు గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పలు సమస్యలు తమ దృష్టికి తెచ్చారని ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీపీ గూగులమ్మ గుడి శ్రీలక్ష్మి, జడ్పిటిసి కోట శామ్యూల్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.