Jun 04,2023 16:13

ప్రజాశక్తి-కాకినాడ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, ఎం.శ్రీనివాస్, కేసరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకినాడ పీఆర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు  నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కాలుష్య నివారణ, ప్లాస్టిక్ నివారణ, మొక్కలను పెంచడం, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడం జరిగింది. తదుపరి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, వక్రుత్వ పోటీలలో విజేతలకు బహుమతులు, ప్రశంశాపత్రాలు అందజేశారు.ఈసందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నోరి బాల రామకృష్ణ, షేక్ అహ్మద్, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, విద్యార్థులు, యువతీ యువకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.