- గ్రంథాలయ చైర్ పర్సన్ జమలాపూర్ణమ్మ
ప్రజాశక్తి-నందిగామ : నందిగామ గ్రంథాలయమును ఆధునికరిస్తామని జిల్లా గ్రంధాలయ చైర్ పర్సన్ టి జమలాపూర్ణమ్మ తెలిపారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ టి జమలపూర్నమ్మ శనివారం నందిగామ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందిగామ గ్రంథాలయాన్ని ఇకముందు ఏసి, కంప్యూటర్ రేడియేషన్ , గ్రంథాలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని అన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి మిగిలిన భాగాన్ని ఫ్లోరింగ్, రీడర్స్ కావలసిన పుస్తకములు, రీడర్స్ ఆన్ డిమాండ్ రిజిస్టర్ నందు నమోదు చేసిన పుస్తకాలను కొనుగోలు చేస్తామని చెప్పారు. కొత్త సిబ్బందిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నందిగామ గ్రంథాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు నాయక కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు . సమ్మర్ క్యాంపు సందర్భంగా వచ్చిన విద్యార్థులు, విద్యార్థులతో మాట్లాడి స్వీట్స్ పంపిణీ చేశారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు సమకూరుస్తామని పేర్కొన్నారు. అతి తొందరలో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ నందు గ్రంధాలయాన్ని మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రంథాలయ అధికారి షేక్ మస్తాన్ వలి, సిబ్బంది పాల్గొన్నారు.










