Apr 30,2023 15:51

ప్రజాశక్తి-తాళ్లరేవు : రైతులకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. శివన్నారాయణ స్వగృహంలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. తాళ్లరేవులో మార్కెట్ యార్డు నిర్మాణానికి, ఐ.పోలవరంలో గోడౌన్ ఏర్పాటుకు సమావేసంలో చర్చించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లను, ఎక్స్ అఫిషియో సభ్యులను శివన్నారాయణ దుస్సాలువ పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి రాజు బుల్లిరాజు, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశి హనుమంతరావు, డైరెక్టర్లు సంగాని వీర నాగేశ్వరమ్మ, ముసునూరి శ్రీలత, సవరపు లోవలక్ష్మి, ముదునూరి వెంకటేశ్వరరాజు, మందపాటి మహాలక్ష్మి, కాజా అరుణ, బసవ రామ లక్ష్మణరావు, నక్క మరియ, వరసాల రమాదేవి, టి.ప్రభాకర్ రావు, చింతలపూడి చిట్టిబాబు, రమణాతి బాలకృష్ణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల కుటుంబరావు, పెసింగి శివ, పెసింగి సతీష్  పాల్గొన్నారు.