Oct 06,2023 13:14

ప్రజాశక్తి-పుట్లూరు : మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఏ కొండాపురం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ఏ కొండాపురం గ్రామానికి చెందిన కృష్ణవేణి 49 సంవత్సరాలు భర్త చనిపోవడం జరిగినది. కూతురు మ్యారేజ్ కావడంతో ఇంట్లో ఒక్కతే ఉండేదని సమస్య వచ్చిందేమో తెలియదు కానీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూతురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తాడపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.