Oct 05,2023 12:03

ప్రజాశక్తి - చాపాడు : చాపాడు మండల పరిధిలోని సీతారామపురంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఉప్పలూరు లక్ష్మీదేవి(39) అనే మహిళ రైతు గురువారం ఉదయం తన పొలంలో గడ్డి కోస్తుండగా, విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురైనది.స్థానికులు గమనించి లక్ష్మీదేవిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  మృతురాలికి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .