May 24,2023 15:17

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని.. సంక్షేమ సేవకులుగా మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఎంపీపీ దానమ్మ అధ్యక్షతన,ఎంపీడీవో గీతా వాణి ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. జగనన్నకు మంచి పేరు తెచ్చేలా మీరు పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది అని, సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న నిజమైన నాయకుడు అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర లుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలు అని తెలుపుతూ, ఇప్పుడు పురస్కారం పొందలేని వాలంటీర్లు పోటీ పడి ఉత్తమ సేవలు అందించి వచ్చే సంవత్సరం పురస్కారం అందుకునేలా కృషి చేయాలని తెలిపారు.ఆదోని మండలం మొత్తం 35 సచివాలయ గాను సేవా మిత్రలు 436 సేవా రత్నాలు 5, సేవా వజ్రాలు 2 మందికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ప్రహ్లాద యాదవ్,నారాయణ,రాము, రామాంజనేయులు, రాంకోట్ రెడ్డి,రామకృష్ణారెడ్డి, ఎంఈఓ శివరాములు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్య, పంచాయతీరాజ్ ఏఈ మాలిక్,ఇఓపిఆర్డి నాగరాజ్, వైసీపీ సీనియర్ నాయకులు నరసింహమూర్తి, గుర్నాథ్ రెడ్డి, మండీగిరి శేశిరెడ్డి,వీరేశ, మెడికల్ నాగరాజు,ఘర్జప్ప, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.