May 12,2023 15:37
  • జిజిహెచ్ నర్సింగ్ సూపర్డెంట్ సంధ్యారాణి

ప్రజాశక్తి-కాకినాడ : ఫ్లోరెన్స్ నైటింగే సేవలు స్ఫూర్తిదాయకం అని కాకినాడ జిజిహెచ్ నర్సింగ్ సూపర్డెంట్ సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఫ్లోరెన్స్ నైటింగేల్ 203 జన్మదినం సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశేష సేవలు అందించిన నరసింహులు అనే నర్సింగ్ స్టాఫ్ కు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సూపరింటెంట్ ఎన్ సంధ్యారాణి మాట్లాడుతూ రోగులు పట్ల సేవా నిరతితో సేవలందించిన ప్లోరెన్స్ నైటింగేల్ కీర్తి నేటికీ సజీవంగా ఉందని ఆమె బాటలో నర్సింగ్ వృత్తినెంచుకున్న వారు పయనించాలని కోరారు. అనంతరం ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరన్స్ బ్రాంచి మేనేజర్ పి.రాజేష్, ప్రేమకుమార్ లు  సీనియర్, హెడ్ నర్సులకు ప్రశంసా పత్రాలు అందజేసీ ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్టాఫ్ నర్సులు, గ్రేడ్ టూ నర్సింగ్ సూపరింటండెంట్ అన్నపూర్ణ, అక్కమ్మ, శ్యామల, కాకి పరమేశ్వరి, యాని గ్రేష్, హేమలత, తదితులున్నారు.