Jun 04,2023 16:40

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : కరాటేలో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభను చాటడం గర్వ కారణం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించే కార్యక్రమం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో ఆదివారం జరిగింది. స్థానిక కరాటే కోచ్ డి శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోసెస్, లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ చిత్తులూరీ వీర్రాజు(రాజా), భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామర్లకోట నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనపరచి పథకాలు సాధించడం ఎంతో అభినందనీయమన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దశాబ్ద కాలం పైబడి ఉచితంగా విద్యార్థులకు కరాటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా వ్యవహరిస్తూ విద్యార్థులు మానసిక ధైర్యాన్ని నింపుతున్న కోచ్ శంకర్ సేవలను వారు కొనియాడారు. రానున్న రోజుల్లో ఇలాంటి పథకాలు మరిన్ని సాధించి రాష్ట్రానికి సామర్లకోట పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మే నెల 26 నుంచి 28వతేదీ వరకు విశాఖపట్నంలో జరిగిన ఇండోనేపాల్ అంతర్జాతీయ పోటీల్లో విద్యార్థుల ప్రతిభకు పాటు పడిన ఉభయ తూర్పుగోదావరి జిల్లాల కరాటే కోచ్ మాస్టర్లు బద్రి, కామేష్, ప్రసన్న, భద్రరావులను పూలమాలలు జ్ఞాపికలతో కోచ్ శంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించి గౌరవించారు. అలాగే కార్యక్రమంలో ముఖ్య అతిథులను కోచ్ శంకర ఆధ్వర్యంలో దుస్సాలువాలు,  పూలమాలలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కరెంటు పోటీల్లో పథకాలు సాధించిన 68 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పథకాలను అతిధుల చేతుల మీదుగా అందజేశారు.  తొలుత ఒడిషా రైలు ప్రమాద మృతులకు సంతాపం గా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు సుధారాణి, ఫాస్ట్ ప్రెసిడెంట్ గుండు శంకరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు మేకా శ్రీనివాసరావు, పెద్దాపురం- సామర్లకోట రోటరీ క్లబ్ ఫాస్ట్ అధ్యక్షులు, చాచా విద్యానికేతన్ కరస్పాండెంట్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ రెడ్డి లోవకుమారి, నాయకులు మూర్తి, టీవీ రమణ, బి రామారావు, గోపాల్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.