Jul 07,2023 15:16

ప్రజాశక్తి-అన్నవరం : కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుని సత్యదేవ లయన్స్ క్లబ్ ఆఫ్ అన్నవరం ఘనంగా సత్కరించారు శనివారం స్థానిక క్లబ్ కార్యాలయంలో లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పర్వత జానకి రాజబాబు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు శంఖవరం గ్రామానికి చెందిన క్రీడాకారుడు మేడిశెట్టి వెంకటరమణ ను సన్మానించారు అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారునికి శిక్షణ ఇచ్చిన శృంగవరం గ్రామానికి చెందిన మాస్టర్ రామోజీ వెంకటేష్ ని కూడా సత్కరించారు ఈ సందర్భంగా క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జానకి రాజబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు క్లబ్ తరఫున సత్కరించడం వారిలో మరింత ఆత్మ ధైర్యం పెంపొంది మునుముందు మరిన్ని గోల్డ్ మెడలో సాధించేందుకు దోహదపడుతుందని ఆమెతెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్  ప్రతినిధులు డొంకాటగిరి పంచాది గుర్రాజు సునీత గుర్రాజు నానాజీ అర్జున్ రావు పాల్గొన్నారు