Mar 14,2023 15:46

న్యూఢిల్లీ  :  టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణ రేటు గతేడాది ఫిబ్రవరిలో 13.43 శాతంగా ఉండగా, ఈ ఏడాది జనవరిలో 4.73 శాతంగా నమోదైనట్లు అధికారిక నివేదిక తెలిపింది. గతేడాది అక్టోబర్‌ నుండి టోకు ద్రవ్యోల్బణం దిగివస్తోంది. సెప్టెంబర్‌ వరకు వరుసగా 18 నెలల పాటు రెండంకెల స్థాయిలోనే ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా స్వల్పంగా తగ్గింది.
రెండేళ్ల గరిష్టానికి పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ముడిపెట్రోలియం, సహజవాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఖనిజాలు, కంప్యూటర్‌ మరియు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, మోటర్‌ వాహనాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం రేటు దిగివచ్చిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. 2023 ఫిబ్రవరి పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 2.59 శాతం కాగా, కూరగాయలు -21.53 శాతంగా ఉంది. నూనెగింజల ద్రవ్యోల్బణం -7.38 శాతంగా ఉంది.