Oct 02,2023 16:26

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలోని జగనన్న లే అవుట్ లో రూ 38.88 లక్షల జల జీవన్ మిషన్ నిధులతో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను వైయస్సార్సీపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కంటే వీర రాఘవరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, పంచాయితీ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా వీర రాఘవరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలో ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు ఈ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ వినోద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.