- సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్
- నీటి కొరత తీర్చాలని గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి వినతి ఇస్తున్న సిపిఐ నాయకులు
ప్రజాశక్తి-పత్తికొండ:- పత్తికొండ పట్టణంలో పార్వతి కొండ వాసులకు నీటి కొరత తీర్చాలని సిపిఐ ఆధ్వర్యంలోన శుక్రవారం రోజు గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహులుకి వినతిపత్రం ఇస్తున్న సిపిఐ నాయకులు కాలనీవాసులు అనంతరం సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలో పార్వతి కొండ గత 18 సంవత్సరాల కిందట భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో భూ పోరాటం చేసి కాలనీలో దాదాపు 50 కుటుంబాలు నివాసముతో నిరంతరం కష్టపడి కూలి నాలి చేసుకొని పొట్ట పోసుకున్న కష్టజీవులకు గ్రామపంచాయతీ అధికారులు అనేక సంవత్సరాల నుండి ఆ కాలనీకి పైప్ లైన్ వేసి పబ్లిక్ కుళాయిలు వేయాలని గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఏమాత్రం పట్టించుకోగా నిర్లక్ష్యంతో నేటి కొరత తీర్చే దాంట్లో నిర్లక్ష్యం రాత్రి పగులు నీటి కోసం ఎదురుచూస్తూ కూలి పోతే కుండకాల లేకపోతే కడుపు కాలే పేదలు నీటి కోసం నిరక్షిస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ కాలనీకి సిసి రోడ్లు కానీ డ్రైనేజీ గాని లేకపోవడం వల్ల ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజలు అసౌకర్యంగా జీవన కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వస్తువుల పైన చెస్సులు పన్నులు నీటి పనులు చెత్త పన్ను ఇంటి పన్ను అనేక రకాలు పన్నుల మీద పన్నులేసి పేద ప్రజల నుండి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు పేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఎండాకాలంలో మంచినీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ అధికారులు మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాలను పట్టణాల్లోనా వివిధ కాలంలో నీటి కొట్టతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మంచినీటి సరఫరా చేయకుండా అధికారుల అలసత్వం విడాలని ఆ కాలనీకి కొరత తీర్చలేని పక్షంలో రానున్న రోజుల్లో తీర్చలేకపోతే పెద్ద ఎత్తున ఆర్డబ్ల్యూ ఆఫీస్ గ్రామపంచాయతీ ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం కారన్న సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు పారుతుకొండ సిపిఐ శాఖ కార్యదర్శి నాగేంద్ర ఏ ఐ ఎస్ ఎఫ్ అల్తాఫ్ పాల్గొన్నారు.










