Jul 19,2023 20:50
  • ఇస్లామాబాద్‌లో కాంపౌండ్‌ వాల్‌ కూలి 11మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ వర్షాల కారణంగా కాంపౌండ్‌ వాల్‌ కూలి 11మంది కార్మికులు మరణించారు. బుధవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో వున్న వంతెనకు సమీపంలో గల భవనం కాంపౌండ్‌ వాల్‌ వర్షాల కారణంగా మరింత బలహీనపడి కూలిపోయిందని పోలీసులు తెలిపారు. నిర్మాణం జరుగుతును ప్రదేశంలో రోడ్డుపక్కన టెంట్లు వేసుకుని అందులో కూర్చును కార్మికులపై గోడ కూలింది. శిధిలాల కింద సమాధై 11మంది మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మృతులకు సంతాపం తెలియచేశారు. జూన్‌ 25 నుండి పాకిస్తాన్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు 115మంది మరణించారు. నదులు పొంగిపొర్లుతుండడంతో వందలాది గ్రామాలు నీట మునిగాయి. దాదాపు 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.