Jun 08,2023 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈ నెల 15లోపు పూర్తి చేయాలని ఆ శాఖ సంచాలకులు లక్ష్మీషా తెలిపారు. ఈ మేరకు జిల్లా, అంతర జిల్లా స్థాయిల్లో బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను, బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ ఉత్తర్వులను గురువారం విడుదల చేశారు. వికలాంగులకు, మానసిక, మందబుద్ది సమస్యలతో వును పిల్లలను కలిగి వును ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతను ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబందించిన సర్టిఫికెట్‌లను ఎంపిడిఓ గానీ, మునిసిపల్‌ కమిషనర్‌ గాని స్వయంగా పరిశీలించి కౌంటర్‌ సిగుేచర్‌తో కలెక్టర్‌కు నివేదించాలని పేర్కొన్నారు. సర్టిఫికేషన్‌ ప్రక్రియను ఈ నెల 10లోపు పూర్తి చేయాలని తెలిపారు. మే నెల 28 నాటికి ఉను ఖాళీల ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇదే నెల 15న కలెకర్టకు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు.

  • జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ

జిల్లా స్థాయిలో జరిగే బదిలీలకు ఈ నెల 10లోపు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలి. ఏదైనా కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురయితే ఈ నెల 12న మండల కార్యాలయాల వద్ద జాబితాను ప్రదర్శించాలి. 14, 15 తేదీల్లో కౌన్సిలింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి.

  • అంతర్‌ జిల్లాల బదిలీల ప్రక్రియ

అంతర జిల్లాల బదిలీల ప్రక్రియకు దరఖాస్తులను ఈ నెల 9లోపు పంపుకోవాలి. ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలను ఇదే నెల 10న రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి పంపాలి. 13న పరిశీలన జరిపి ఆయా జిల్లాలకు సర్క్యులర్‌లను పంపుతుంది. ఈ నెల 14, 15 తేదీలలో బదిలీలకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తారు.