Nov 02,2023 09:55

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 24 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ చేస్తూ విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఏ.రవిశంకర్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి. వీరిలో 1 టౌన్‌ (లా అండ్‌ ఆర్డర్‌) పోలీస్‌ స్టేషన్‌ నుండి ఎల్‌.రేవతమ్మ , సీసీఆర్బి నుండి ఎం.అవతారం, ఎయిర్పోర్ట్‌ ఇమ్మిగ్రేషన్‌ (సీఎస్బి-4) నుండి డి.శ్రీహరి రాజులను విఆర్‌ కు సరెండర్‌ చేయగా, విశాఖపట్నం సిటీ విఆర్‌ ఎడిసీపి ట్రాఫిక్‌ పరిధి లో కోటా సురేష్‌ , సి.హెచ్‌.వెంకట్రావులను, విశాఖపట్నం సిటీ విఆర్‌ డిసీపి (లా అండ్‌ ఆర్డర్‌ -1) పరిధిలో బీ.వీ.జగన్నాథరాజు, బి.భాస్కరరావు, ఎస్‌.షణ్ముఖరావు, విశాఖపట్నం సిటీ విఆర్‌ డిసీపి (లా అండ్‌ ఆర్డర్‌ -2) నుండి ఆర్‌.సోమేశ్వర్‌ రావు, బి.లుదర్‌ బాబు, విఆర్‌ విశాఖపట్నం సిటీ నుండి వి.చక్రధర రావు, ఎస్‌.అమ్మి నాయుడు, జి.గోవింద్‌ రావు, సి.హెచ్‌.వాసు నాయుడు, సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ నుండి కె.భవాని ప్రసాద్‌ రావు, న్యూ పోర్ట్‌ (లా అండ్‌ ఆర్డర్‌) పోలీస్‌ స్టేషన్‌ నుండి ఎస్‌.రాము, సిటీ విఆర్‌ నుండి ఏ.సంతోష్‌ కుమార్‌, ఎస్‌. కాంతారావు , జి.సంజీవరావు ద్వారకా (లా అండ్‌ ఆర్డర్‌) సి.హెచ్‌ సింహాద్రి నాయుడు, సిఎస్బి-2 నుండి కె.దుర్గ ప్రసాద్‌, సిఎస్బి-3 నుండి మహమ్మద్‌ సనానుల్ల, ఎంవిపి (లా అండ్‌ ఆర్డర్‌) స్టేషన్‌ నుండి హెచ్‌.మల్లేశ్వరరావు, ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ క్రైమ్‌ నుండి వి.వి.సి.ఎం.ఎర్రం నాయుడులను నగరం లోని పలు స్టేషన్‌ లకు బదిలీ చేసారు. ఈ బదిలీ లు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన ఉత్తరువులలో పేర్కొన్నారు.