May 31,2023 11:28
  • ఎరువులు షాపులు మూసివేత

ప్రజాశక్తి-నందిగామ : పట్టణంలో విత్తనాలు ఎరువులు షాపులపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఏడి కళ్యాణ ఆధ్వర్యంలో కానిస్టేబుల్స్ రవి, రవి బాబు లు విత్తనాలు షాపులు తనిఖీ చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా వేసవికాలంలో విత్తనాలు బుకింగ్ చేస్తున్న క్రమంలో ఈఎస్ అగ్రిటెక్ పత్తి విత్తనంకు గిరాకీ ఉండడంతో గత ఏడాది బ్లాక్ అమ్మడం జరిగింది. ఈ యాడాది కూడా అదే విత్తనం కోసం రైతులు ఎగబడుతుంటుందో యూఎస్ అగ్రిటెక్ విత్తనాలు బ్లాక్ లో అమ్ముతున్నారని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం విజిలెన్స్ అధికారులు విత్తనాలు ఎరువులు షాపులపై దాడులు నిర్వహిస్తుండడంతో నందిగామలో చర్చ నియాసం మారింది. నూజివీడు విత్తనాలు కూడా బ్లాక్లో అమ్ముతున్నారని రైతులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు స్పందించి ఖరీఫ్ సీజన్ నాటికి నాణ్యమైన మనీ కన్నా కల్తీ లేని విత్తనాలు రైతులకు అందించాలని ప్రజలకు కోరుతున్నారు.