ప్రజాశక్తి-పెద్దకడబూరు : పెద్దకడబూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి అశ్వద్ధామ గురువారం వైస్ ఎంపీపీ -1 ఎన్నిక నిర్వహించారు. చిన్న తుంబలం ఎంపిటిసి -1 ముత్తమ్మ వైస్ ఎంపీపీ-1 గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమెను బస్సుల దొడ్డి ఎంపీటీసీ అంజన్నయ్య బలపరిచారు. ఎన్నికకు హాజరైన 12 మంది ఎంపీటీసీలు ముత్తమ్మకు వైస్ ఎంపీపీ 1గా మద్దతు పలకడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.










