- జిల్లా గ్రంథాలయంలో వేసవి విడిది
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులు వేసవిలో ఎండలకు తిరగకుండా విజ్ఞానం వినోదాన్ని అందించే వేసవిజ్ఞాన శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా వేసవి శిక్షణ శిబిరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్రంథాలయ కార్యదర్శి కె.ప్రకాష్ అన్నారు. కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ కేంద్ర గ్రంధాలయం నందు 8-5-2023నుండి జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో బాగంగా బుధవారం వచ్చిన విద్యార్థులకు స్టోరీ పుస్తకాలు చదివి వారికి విన్పించడం, విద్యార్థులచే చెపిస్తు ,పాటలు పాడించడం, స్పీచెస్ ఇప్పించడం,బాలలకు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ నివారణ కోసం సూచనలు సలహాలు పాటించాలని తెలియజేస్తూ విద్యార్థులకు దశ దిశా నిర్దేశం చేశారు.ఉదయం 8గంటల నుండి 9.30వరకు రిటైర్మెంట్ లెక్చరర్ ఉశ్శేన్ పీరా విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియంలో గ్రామర్ తెలియజేసారు. తదనంతరం గ్రంథాలయ లైబ్రేరియన్ లు గోవిందరెడ్డి, యస్.భాష, విద్యార్థులకు తెలుగు సామెతలు జాతీయతను కాపాడుకోవడానికి, వారి ఉన్నతికి దోహదం చేసే చిన్న చిన్న కథలు, ఆధ్యాత్మిక తను తెలియజేసారు. తదనంతరం విద్యా వాలంటీర్ అయిన వి.వెంకటేశ్వరరెడ్డి విద్యార్ధులకు జోక్స్ కవితలు పద్యాలు తెలియజేస్తూ పేపర్లతో డిజైన్ లు చేయడంలో మెళకువలు నేర్పించారు.తదనంతరము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారైన రేణుక, అబ్దుల్ కలాం, కాలీదాసు, లక్ష్మీ దేవి బాయి, మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులు యాగంటీ శ్వరప్ప కలిసి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అని మొక్కలు నాటి పచ్చదనం పెంచుకోవాలని సూచించారు.విద్యార్తులచే ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరము హిందీ పండితురాలు చాంద్ బీ పర్యావరణ దినోత్సవం గురించి చిన్నారులకు వివరించారు. జిల్లా కార్యదర్శి కె. ప్రకాష్ మరియు పుర ప్రముఖులు కె. జి. గంగాధర్ రెడ్డి విద్యార్ధులకు చల్లటి పానీయాలు పెన్నులు పంచారు. ఈ కార్యక్రమం లలో గ్రంథాలయ సిబ్బంది వజ్రాల గోవిందరెడ్డి యస్. భాష, ఈశ్వరమ్మ, శ్రీనివాస్లు, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాఠకులు పాల్గొన్నారు.










