Oct 26,2023 16:12

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరో వెంకటేష్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వాహిని నిశ్చితార్థం జరిగింది. నిన్న వెంకటేష్‌ స్వగృహంలోనే జరిగిన ఈ వేడుకకు మెగస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రాణాలతోపాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, వెంకటేష్‌, నీరజ్‌ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్‌లు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. ప్రస్తుతం వెంకటేష్‌ దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న 'సైంధవ్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది.

venkatesh doughter engagement

 

venkatesh 2