ప్రజాశక్తి -కర్నూలు కల్చరల్ : ప్రముఖకవి, కథారచయిత కాశీభట్ల వేణుగోపాల్ స్థాపించిన అక్షరం లిటరరీ ట్రస్ట్ తొలిపురస్కారాన్ని తొలిసారిగా కథారచయిత, పబ్లిషర్ అయిన వెంకట్ శిద్దారెడ్డికి ప్రకటించారు. ఈ సంస్థను ఇటీవల కర్నూలు కేంద్రంగా అక్షరం లిటరరీ ట్రస్టు పేరుతో సాహిత్య సాంస్కృతిక సంస్థను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యరంగంలో కృషి చేస్తున్నవారికి, కవులకు, కళాకారులకు ప్రతీఏడాది అక్షరం ట్రస్టు పురస్కారాలను ఇచ్చేసంస్థగా దీన్ని స్థాపించినట్లు ట్రస్టు కార్యదర్శి ప్రముఖకవి జి.వెంకటకృష్ణ తెలిపారు. ఇందులో సాహిత్యరంగంలో విశేషంగా ఉన్న కవులు సాహిత్యాభిమానులతో ట్రస్టీ ఏర్పాటైందన్నారు. ఈ ఏడాది అక్షరం ట్రస్టు పురస్కారం-2023 ఇస్తున్నామని తెలుగురాష్ట్రాల్లో అనిర్వచనీయ సాహిత్యసేవ చేశారన్నారు. ఈ పురస్కార ప్రదానం కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ హాలునందు ఈనెల 26న ఆదివారం ఉ.10.30 గంటలకు చేయనున్నామని పురస్కారం సందర్భంగా 25వేల రూపాయల నగదు, మెమొంటోతో సత్కరిస్తారమన్నారు.










