Jul 02,2023 10:35
  • సెంచరీ కొట్టిన టమాటా ధర
  • పచ్చిమిర్చి.. కిలో రూ. 140
  • మిగిలిన కూరగాయలు ధరలు రూ.40 పైమాటే
  • బెంబులెత్తుతున్న సామాన్య ప్రజలు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కూరగాయల ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. టమాటా, పచ్చిమిర్చి ధరలు సంచరీ దాటేసాయి. కాకినాడ మార్కెట్ లో శనివారం టమాటా రూ.100, పరచిమిర్చి రూ.140 అమ్మకాలు సాగాయి. మిగిలిన కూరగాయల ధరలు రూ.40కి తక్కువ లేవు. గత రెండు నెలల నుంచి ఎండలుమండిపోవడంతో స్థానికంగా కూరగాయ పంటలు తగ్గడటంతో పతుగ కూరగాయల దిగుమతి తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. జిల్లా రైతులు గత రబీలో సాగు చేసిన టమాటా పంట ఏప్రిల్తోనే పూర్తయ్యిందని, జిల్లా అవసరాల కోసం అప్పటి నుంచి చిత్తూరు జిల్లా, పుంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లా మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని హోల్సేల్ వర్తకులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. ఏప్రిల్ చివరలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. మార్కెట్లో 25 కిలోల క్రేట్ రూ.50కి పలకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలువురు రైతులు || టమాటాలను కోయకుండా పొలంలోనే వదిలేశారు. తరువాత ఎండలు విపరీతంగా కాయడం, ఇదే సమయంలో అకాల వర్షాలు పడడంతో టామాటా. తోటలు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. సరిగ్గా రెండు నెలల కిత్రం.. మే మొదటి వారంలో కాకినాడ హోల్సేట్ మార్కెట్లో క్రేజీ టమాటాలు (సుమారు 25 కిలోలు) రూ.150 ధర వుంది. రిటైల్గా కిలో రూ.10 చొప్పున విక్రయించారు. తరువాత క్రమేపీ పెరుగుతూ అదే నెల చివరినాటికి కిలో రూ.30కు పెరిగాయి. జూన్లో మరింత పెరుగుతూ వచ్చాయి. మొదటి వారంలో కిలో రూ.35కు, రెండో వారంలో రూ.40కి, మూడో వారంలో 50కి, చివరి వారంలో ఏకంగా రూ.100కు చేరాయి. ప్రస్తుతం మదనపల్లె, పుంగనూరు మార్కెట్లలో క్రేట్ టమాటా రూ.1,700 నుంచి రూ.2 వేలు పలుకుతున్నదని, రవాణా, కలాసీల చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఒక్కో క్రేట్ రూ.1,800 నుంచి రూ.2,100కు రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నామని చెబుతున్నారు. పచ్చిమిర్చి ధర కూడా గణనీయంగా పెరిగింది. శుక్రవారం కాకినాడ మార్కెట్లో రిటైల్గా కిలో రూ.140కి విక్రయించారు. జిల్లాలో పచ్చిమిర్చి పంటను చాలా ఎక్కువ సాగు చేస్తుంటారు. అది కూడా ఏప్రిల్లో అయిపోయింది. జిల్లా అవసరాల కోసం రావులపాలెం, ఏలూరు, తుని ప్రాంతాల నుంచి పచ్చిమిర్చిని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో కూడా పంట తగ్గిపోవడంతో ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు వర్తకులు చెబుతున్నారు. అక్కడే (ఒడిశా) కిలో రూ.100 ప డుతున్నదని తెలిపారు. నెల రోజుల క్రితం పిచ్చిమిచ్చి కిలో రూ.50 వుండగా, ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. అల్లం ధర చుక్కలను తాకుతున్నది. రకాన్నిట్టి రెటైల్గా కిలో రూ.200 నుంచి రూ.240కు అమ్ముతున్నారు. మిగిలిన కూరగాయల ధరలు సైతం క్రమేపీ పెరుగుతున్నాయి. బీరకాయలు కిలో.80, బెండకాయలు రూ.50. దొండకాయలు రూ.30, వంకాయలు రూ.40 పలుకుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.