ప్రజాశక్తి-చాగల్లు : మండలంలోని చంద్రవరం శాఖ గ్రంథాలయంలో శనివారం ఆశ్వయుజ పౌర్ణమి పురస్కరించుకొని, మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అధికారి కె సుమన్ కుమార్ ఎంపీ యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ రమాంబా పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రామాయణాన్ని రచించిన సంస్కృత ఆది కవి వాల్మీకి అని , ఒక పక్షి మరణంతో మహర్షిగా పరివర్తన చెందిన రత్నాకరుడు, శ్రీరాముని యొక్క దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన వాల్మీకి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు, ఎల్ ధనుష్ , ఏ సంతోష్ ఏ. ముఖర్జీ , పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.