Oct 10,2020 21:30

kitlu

విద్యాకానుక పంపిణీ
మొవ్వ: పెదపూడి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. హెచ్‌ఎం జి.ఉషారాణి, విద్యా కమిటీ ఛైర్మన్‌ మద్దాల వెంకటేశ్వరావు, సిఆర్‌పి సమర్పణరావు పాల్గొన్నారు.
ముదినేపల్లి : మండలంలోని కాకరవాడలో శనివారం జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. యూపి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వైసిపి మండల పార్టీ కన్వీనర్‌ బొర్రా శేషుబాబు, ఎంపిపి అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ, ఎస్సి సెల్‌ జిల్లా కార్యదర్శి బేతపూడి వెంకటరమణ, కాగిత రామారావు, గుమ్మడి రాజు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.