
pampini
విద్యాకానుక అభినందనీయం : ఎంఇఒ
గుడివాడ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టతకు ప్రాధాన్యతనిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల విద్యాశాఖ అధికారి కె.రామరావు అన్నారు. శనివారం స్ధానిక ఏలూరురోడ్డులో ఫాదర్ బియ్యాంకి బాలికల ఉన్నత పాఠశాలలోని 300 మంది విద్యార్థులకు మౌంట్ కార్మేల్‌మాత దేవలయం విచారణ గురువు ఫాదర్ గంటా ప్రవీణ్‌తో కలసి ఎంఇఓ జగనన్న విద్యాకానుక కిట్లను పాఠశాల విద్యార్థిన్థీలకు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జి.జయమ్మ, సిఆర్‌పి ప్రసన్న, సిస్టర్లు శిరీష, విజయశాంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.