కావాల్సిన పదార్థాలు: వామాకులు (శుభ్రంగా కడిగినవి)- 5 లేదా 7, మిరియాలు, మొక్కజొన్న విత్తనాలు - పది, ఎండుద్రాక్ష- పది, తులసి ఆకులు - పది (దొరికితే), తమలపాకులు- రెండు (మీ ఇష్టం), చక్కెర- టీ స్పూన్, అల్లం ముద్ద - స్పూన్, సోంపు గింజలు - అర టీస్పూన్.
తయారుచేసే విధానం:
- గ్యాస్ మీద పాన్‌పెట్టి అందులో రెండు, మూడు కప్పుల నీరు పోయాలి.
- అందులోనే వాము ఆకులు, మిరియాలు, మొక్కజొన్న విత్తనాలు, ఎండుద్రాక్ష, తులసి, తమలపాకులు, చక్కెర, అల్లం వేసి మరగించాలి. ఆ నీరు సగం పరిమాణానికి వచ్చిన తర్వాత దించి, పక్కన బెట్టుకోవాలి.
- బాగా చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి.
- ఈ టీని దగ్గు ఎక్కువగా ఉన్నవారు తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలకూ దీనిని ఇవ్వవచ్చు. అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంత తేనెను కలిపి ఇస్తే ఇష్టంగా తీసుకుంటారు.
- ఇంకా చీమిడి ఎక్కువగా కారే పిల్లలకు, వాంతులు, విరోచనాలు అయ్యే పిల్లలకూ ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అన్నిరకాల పదార్థాలు ఉన్నవి కాబట్టి ఆరోగ్యానికి మంచిది.