కావాల్సిన పదార్థాలు: వామాకులు - రెండు కప్పులు (తరిగినవి), పచ్చిమిర్చి - రెండు, శనగపప్పు- ఒకటిన్నర టీ స్పూన్, మినపప్పు- టీ స్పూన్, జీలకర్ర- ముప్పావు టీ స్పూన్, ఎండుమిర్చి- నాలుగు, చింతపండు - రెండు టీ స్పూన్లు, ఆవాలు- అర టీస్పూన్, నూనె- నాలుగు టీస్పూన్లు, బెల్లము- అర టీ స్పూన్, ఇంగువ- తగినంత, కరివేపాకు - రెబ్బ, ఉప్పు, పసుపు- తగినంత.
తయారుచేసే విధానం:
- గ్యాస్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేయాలి.
- ఆ నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండును వేయించి, పక్కన పెట్టుకోవాలి.
- అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, తరిగి ఉంచిన వాము ఆకును రెండు నిమిషాలు వేయించాలి.
- తర్వాత వామాకుతో పాటు వేయించి పక్కన పెట్టుకున్న పదార్థాలతో పాటు ఉప్పు, పసుపు, బెల్లంవేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
- మరలా పాన్‌లో మరికాస్త నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో తాలింపు గింజలు (శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు) వేయాలి. ఆవాలు చిటపటా అన్నప్పుడు ఎండుమిర్చి రెండు చిన్న ముక్కలుగా చేసి, అందులోనే వేయాలి. ఇంకా కరివేపాకునూ గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో కలపాలి. అంతే వామాకు పచ్చడి రెడీ!