కావాల్సిన పదార్థాలు: వామాకులు- పది, శనగపిండి- ముప్పావు కప్పు, బియ్యం పిండి- పావు కప్పు, ఇంగువ - కొద్దిగా, ఉప్పు- తగినంత, కారం - తగినంత, ధనియాల పొడి- కొద్దిగా, వంటసోడా- కొద్దిగా, జీలకర్ర- చెంచా, పసుపు- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం:
- ముందుగా వామాకులను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఇంగువ, ఉప్పు, కారం, ధనియాల పొడి, వంటసోడా, జీలకర్రను వేసి, బాగా కలపాలి.
- ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోస్తూ బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి.
- తరువాత గ్యాస్‌పై పాన్ ఉంచి, నూనెను పోసి కాగనివ్వాలి.
- శనగపిండి మిశ్రమంలో వామాకులను ఒక్కొక్కటిగా ముంచి, బజ్జీల్లా వేసుకోవాలి. లేత బంగారు రంగుకి మారిన తరువాత తీసేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన వామాకు బజ్జీలు రెడీ.