Jun 23,2023 15:27

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : 100రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలందరికీ వెంటనే అదనంగా పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటరాముడు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు మండలం, రేమట గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలించారు. ఉపాధి కార్మికుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది 100 రోజులు పూర్తి చేసుకున్నారన్నారు. జూన్ చివరికి వచ్చిన వర్షాలు పడవక పోవడం వలన గ్రామాలలో పనులు లేక అందరు ఉపాధి హామీ పనులకు  వెళ్తున్నారన్నారు. వర్షాలు ఎప్పుడు వస్తావో అని అయోమయం పరిస్థితిలో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు వుండటం వలన అంతో ఇంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. వెంటనే 100 రోజులు అయిపోయిన కుటుంబాల వారికి పనిదినాలు కల్పించి ఆదుకోవాలన్నారు. రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు 7వారాలు పనులు చేసిన బిల్లులు ఇవ్వక పోవడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. పనులకు పోతే పూట గడవని కూలోల్లతొ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని వారు విమర్శించారు. చట్టంలో 15 రోజులకు ఒక సారి బిల్లులు ఇవ్వాలని వుందని, 15 రోజులు దాటితే వడ్డీతో సహా ఇవ్వాలని ఉందన్నారు. వెంటనే బిల్లులు వడ్డీతో సహా ఇవ్వాలని లేని యడల కూలీలను సమీకరించి ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. 200 రోజులు పనులు కల్పించి, రూ.600 లు వేతనం ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పనులు  అమలు చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, సునీల్, మల్లన్న, విమలమ్మ, లలితమ్మ, బాజరి రాముడు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.