
అనగనగా ఒక గ్రామంలో కవిత అనే మహిళ ఉండేది. ఆమె చాలా మంచిది. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా సహాయం చేసేది.
అదే గ్రామంలో లక్ష్మి అనే మరో మహిళ ఉండేది. ఆమె చాలా స్వార్ధపరురాలు. అందరినీ బాధించేది.
ఇంతలో ఎలక్షన్లు వచ్చాయి. కవిత, లక్ష్మి ఇద్దరూ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కవితను అందరూ కలిసి సర్పంచిగా ఎన్నుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసి లక్ష్మి చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కానీ ఎలక్షన్లలో గ్రామస్తులు ధైర్యంగా, ఐక్యతతో కవితకు ఓటువేసి ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకొని తమ ఐక్యమత్యం చాటారు. ఓడిపోవడంతో లక్ష్మి గ్రామం నుంచి వెళ్ళిపోయింది. గ్రామస్తులందరూ సంతోషించారు.
బి. రుషిత
6వ తరగతి
విజరు హైస్కూల్
నిజామాబాద్.