న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వినిపించారు. 1.25 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ప్రభుత్వం కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. దీంతో ఏఏ వస్తువులు చౌకగా లభిస్తాయో, ఏఏ వస్తువులపై అధిక ధరల ప్రభావం పడిందనే విషయాన్ని పరిశీలించాలి.
ధరలు పెరిగేవి .. :
- బంగారం, ప్లాటినంతో తయారైన ఆభరణాలు
- ఇమిటేషన్ జ్యూయలరీ ( గిల్టు నగలు)
- సిగరెట్లు
- వెండి ఉత్పత్తులు
- వంటగదిలో వినియోగించే ఎలక్ట్రిక్ చిమ్నీలు
- దిగుమతైన సైకిళ్లు, ఆటవస్తువులు
- విదేశాల నుండి దిగుమతయ్యే రబ్బరు
ధరలు తగ్గేవి :
- హీట్ కాయిల్స్
- మొబైల్ భాగాలు, ల్యాప్‌టాప్
- డిఎస్‌ఎల్‌ఆర్‌ల కెమెరా లెన్సెలు
- టివి ప్యానెల్ భాగాలు
- లిథియం అయాన్ బ్యాటరీలు
-ఎలక్ట్రిక్ స్కూటర్లు










