ఐక్యరాజ్య సమితి : అణ్వాయుధాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటె రస్ మంగళవారం పిలుపిచ్చారు. ''అణ్వా యుధాల సంపూర్ణ నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస జనరల్ అసెంబ్లీలో గుటెరస్ మాట్లాడుతూ, అణ్వా యుధాల వినియోగాన్ని నివారించడానికి గల ఏకైక వాస్తవిక మార్గం వాటిని సమూలంగా నిర్మూలించడమేనన్నారు. ఈ ప్రాధమిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఏ అణ్వాయుధాన్నైనా,ఎక్కడైనా, ఏ సందర్భంగానైనా ఉపయోగించామంటే, మానవ వినాశనానికి ద్వారాలు తెరిచినట్లేనని ఆయన హెచ్చరించారు.కొత్తగా అణ్వాయుధ పోటీ తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారిగా అణ్వాయుధాల సంఖ్య పెరగబోతుంది. వాటి వినియోగం, వ్యాప్తి, పరీక్షలను నివారించడం కోసం రూపొందించుకున్న నిబంధనలు, షరతులకు ఇది విఘాతం కలిగిస్తోంది. అంతర్జాతీయ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకం వంటి అంశాలు తుడిచిపెట్టుకు పోతున్నాయి. అణ్వాయుధాలను మరింత వేగంగా, ఖచ్చితంగా, బలంగా ఉపయోగించేలా ఆధునీకరిం చబడుతున్నాయి. ఇది మానవాళికే ప్రమాదం. సుదీర్ఘ చర్చల తరువాత రూపొందించుకున్న అణ్వ స్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలు, అణు నిరాయుదీ óకరణ ఒప్పందాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరం వుందని చెప్పారు.